April 2, 202504:05:56 AM

Balakrishna Controversy: అంజలి.. టీమ్‌.. ఎంత కవర్‌ చేసినా నెటిజన్లు మరో వీడియో పట్టేశారు!

నందమూరి బాలకృష్ణ (Balakrishna)  చాలా హుషారుగా ఉంటారు. సినిమాల్లోనే కాదు, బయట కూడా అలానే ఉంటారు. ఒక్కోసారి ఆయన ఆ హుషారులో చేసే పనులు ఇతరుల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఒకప్పుడు సోషల్‌ మీడియా పెద్దగా లేనప్పుడు ఈ విషయాలు తక్కువమందికే తెలిసేవి. అయితే మొబైల్‌ ఫోన్లు పెరగడం, సోషల్‌ మీడియాలో జోరందుకోవడంతో బాలయ్య చేసే కొన్ని చిలిపి చేష్టలు బయటకు వస్తున్నాయి. అలా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన కొన్ని పనులు బయటకు వచ్చాయి.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ స్టేజ్‌పై అంజలిని (Anjali) బాలకృష్ణ నెట్టేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే మొత్తం వీడియో చూడండి, అసలు విషయం అది కాదు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు చెప్పాక కాస్త క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత అంజలి కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అని చెప్పారు. అయితే ఇప్పుడు మరో వీడియో బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. అంజలిని ఇబ్బందికర ప్రదేశంలో టచ్‌ చేసినట్లుగా ఉంది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే కావాలనే బాలయ్య అలా చేశాడా? లేక పక్కనే కూర్చున్న ఆమెను స్టేజీ మీదకు పిలిస్తే వెళ్లమని ప్రోత్సహిస్తూ అలా చేశాడా అనేది ఆయనకు, అంజలికే తెలియాలి. మరోవైపు ఆ వీడియోలో కూడా వాటర్‌ బాటిల్‌ వెనుక మరో బాటిల్‌ కనిపిస్తోంది. ఆ బాటిల్‌ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అయితే దానికి గతంలో సీజీ అని నిర్మాత చెప్పారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు మరోసారి ఈ విషయంలో ‘బాలయ్య మళ్లీ దొరికాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నాయి. అయితే అందులో పెద్ద విషయం ఏముంది అని కామెంట్లు చేస్తున్నవాళ్లూ ఉన్నారు. అయితే ఈ విషయం ఇక్కడితే ఆగిపోవాలి. మళ్లీ ఇంకేదో క్లారిటీ ఇచ్చి ఇంకా చర్చ చేసుకునేలా ఉండకూడదు అని అంటున్నారు కొంతమంది తటస్థ నెటిజన్లు. మరి సినిమా టీమ్‌ ఏం చేస్తుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.