March 22, 202504:22:50 AM

పెళ్లి ఫోటోలు డిలీట్.. ఆ స్టార్ కపుల్ విడిపోతున్నారా?

ప్రేమించడం.. డేటింగ్ చేయడం..బ్రేకప్ చెప్పుకోవడం.. ఒకవేళ ప్రేమ డేటింగ్ వర్కౌట్ అయితే పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత పడకపోతే విడాకులు తీసుకోవడం, ఇవి అందరికీ కామన్ అయిపోయాయి. అయినప్పటికీ సినిమా వల్ల వ్యవహారాలే హైలెట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి..! అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది కాబట్టి..! ఇప్పటికే సమంత (Samantha) – నాగ చైతన్య (Naga Chaithanya) , ధనుష్ (Dhanush) – ఐశ్వర్య(Aishwarya) , ఆమిర్ ఖాన్ (Aamir Khan) – కిరణ్ రావ్ (Kiran Rao) ,సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) దంపతులు…

వంటి స్టార్ విడాకులు తీసుకుని సెపరేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ కపుల్ కూడా మానాస్పదలా వల్ల విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్టు ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇందులో నిజం లేదు అంటున్నారు. కానీ ఎక్కువ మంది.. అది నిజమే అంటున్నారు.

విషయం ఏంటంటే.. ‘జయం’ రవి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తన భార్య ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు డిలీట్ చేశాడట. మరోపక్క ఆర్తి కూడా అలాగే తన ఫ్యామిలీ ఫోటోలు డిలీట్ చేసిందట. కొన్నాళ్ల నుండి విడాకులు తీసుకోబోయే సినీ కపుల్స్ ముందుగా చేస్తున్న పని ఇదే. అందుకే జయం రవి- ఆర్తి దంపతుల విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. మరి అది నిజమో కాదో తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.