April 2, 202503:38:22 AM

Chaitan Bharadwaj: అజయ్ భూపతి పై ‘ఆర్.ఎక్స్.100’ మ్యూజిక్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆర్.ఎక్స్.100 ‘ చిత్రంతో టాలీవుడ్ కి ఓ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అతనే చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj). విడుదలకు ముందే ఆ సినిమాలోని పాటలు మార్మోగాయి. సినిమా రిలీజ్ అయ్యాక యూత్ ఆ పాటలని మరింతగా ఆదరించారు. ఆ సినిమా తర్వాత ‘మన్మధుడు 2’ (Manmadhudu 2) ‘గుణ 369 ‘ ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ (SR Kalyanamandapam) ‘మహాసముద్రం’ (Maha Samudram) ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) వంటి సినిమాలకు సంగీతం అందించాడు చేతన్. ఇందులో దాదాపు అన్నీ మ్యూజికల్ గా సక్సెస్ అయ్యాయి.

ఇటీవల రిలీజ్ అయిన ‘హరోం హర’ (Harom Hara)  సినిమాకి అయితే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ అందించాడు చేతన్ భరద్వాజ్. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మాత్రం ఫుల్ మర్క్స్ పడ్డాయి. ఎప్పుడూ లవ్ సినిమాలకి పనిచేసే చేతన్ లో ఇంత మాస్ ఉందా అంటూ ‘హరోం హర’ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చేతన్ .. ‘మంగళవారం’ (Mangalavaaram) సినిమా గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

వాస్తవానికి ఆ సినిమాకి చేతనే మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై చేతన్ స్పందించాడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) గురించి మాట్లాడుతూ..”అతను అనుకున్న కథకి అజనీష్ అయితే కరెక్ట్ అనుకున్నాడేమో నాకు తెలీదు. హ్యాట్రిక్ కాంబో అయ్యేది. కుదరాలి కదా..! కుదర్లేదు.!కొన్ని ట్యూన్లు కూడా కంపోజ్ చేశాను.

కానీ ఆ సబ్జెక్ట్ కి అజనీష్ తోనే చేస్తే బాగుంటుంది అని అతను అనుకుని ఉండొచ్చు. నేను అతనికి వర్కౌట్ కావట్లేదేమో అనుకుని ఉండొచ్చు. డైరెక్టర్ టేస్ట్ బట్టే కదా అన్నీ వర్కౌట్ అయ్యేది. వాళ్ళ నుండే కథ పుడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడి మనతో చేయడం కంటే.. వాళ్ళు అనుకున్నది చేయడమే బెటర్” అంటూ చెప్పుకొచ్చాడు చేతన్ భరద్వాజ్.

Director Ajay Bhupathi's Maha Samudram Movie1

అయితే ‘మంగళవారం’ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయిందేమో కానీ ఒక్క పాట కూడా జనాలకి ఎక్కలేదు. చేతన్ భరద్వాజ్ కనుక మ్యూజిక్ అందించి ఉంటే.. పాటలు కూడా వర్కౌట్ అయ్యేవేమో..! ఇతని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.