March 22, 202507:40:11 AM

Chaitan Bharadwaj: బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా సీన్ ఎలా హైలెట్ అవుతుంది.. అది తప్పు : చేతన్ భరద్వాజ్

బోయపాటి శ్రీను (Boyapati Srinu) … సహజంగా మీడియాకి చాలా దూరంగా ఉంటారు. ఎక్కువగా మీడియా సమావేశాలకు ఆయన హాజరు కారు. కానీ ‘స్కంద’ (Skanda) సినిమా రిలీజ్ టైంలో ఆయనకు నచ్చిన ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఓ ఇంటర్వ్యూలో.. ఈయన తన ‘అఖండ’  (Akhanda) సినిమా గురించి ముచ్చటించారు. ‘అఖండ’ సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపిస్తుంది.సోల్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ బోయపాటి మాత్రం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోయినా ఆ సినిమాలో సన్నివేశాలు హైలెట్ గా అనిపిస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దానికి ఇంకా పొడిగిస్తూ.. ‘బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తీసేసి చూసినా ఆ సన్నివేశాలు అదిరిపోతాయి’… అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ‘స్కంద’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘అఖండ’ రేంజ్లో పేలలేదు. దీంతో ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) సక్సెస్ మీట్ ఈవెంట్లో ‘కంటెంట్ లో దమ్ము లేకపోతే నేను కూడా చేసేది ఏమీ ఉండదు’ అంటూ పరోక్షంగా బోయపాటి కి చురకలు అంటించాడు. ఈ క్రమంలో బోయపాటి నెక్స్ట్ మూవీకి ముఖ్యంగా ‘అఖండ 2 ‘ కి తమన్ (Thaman)  పని చేస్తాడా? లేదా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ‘హరోం హర’ (Harom Hara) సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ‘ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) ఈ విషయంపై స్పందించాడు. ‘బ్యాక్ గ్రౌండ్ లేకుండా సీన్ హైలెట్ అవ్వదు. అమ్మ ప్రేమ గొప్పది అంటాం. అమ్మ అక్కడ నిలబడి ఉంది.. కిడ్ మరోచోట కూర్చుంది. అప్పుడు అమ్మ మాట్లాడితేనే కదా కిడ్ కి అర్థమవుతుంది.

ఇక్కడ కిడ్ అంటే ఆడియన్స్. అమ్మ అంటే విజువల్. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏంటి అంటే మాట్లాడటం(కమ్యూనికేషన్). కాబట్టి సినిమా విషయంలో ఆ కమ్యూనికేషన్ అనేది మ్యూజిక్ అనమాట. కాబట్టి ఏ సీన్ హైలెట్ అవ్వాలన్నా ఎమోషన్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సమాన ప్రాముఖ్యత అనేది ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు చేతన్ భరద్వాజ్.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.