March 21, 202508:48:24 PM

Chiranjeevi Ex Son In Law Passes Away: శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి.!

చిరంజీవి (Chiranjeevi) మాజీ అల్లుడు, శ్రీజ మాజీ భర్త అయిన శిరీష్‌ భరద్వాజ్‌ మృతి చెందారు.39 ఏళ్లకే ఆయన కన్నుమూయడం అనేది అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. 2007 లో చిరంజీవి చిన్న కుమార్తె అయిన శ్రీజను ప్రేమ వివాహం చేసుకున్నాడు శిరీష్ భరద్వాజ్. కుటుంబ సభ్యులకి చెప్పకుండా వీళ్ళు సీక్రెట్ గా వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మీడియాని ఆశ్రయించడంతో.. న్యూస్ ఛానల్స్ లో ఓ నెల రోజుల వరకు ఇది హాట్ టాపిక్ అయ్యింది.

తర్వాత ఎవ్వరికీ అంతుచిక్కని ప్రదేశంలోకి ఈ జంట వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ టైంలో జరిగిన కాంట్రవర్సీలు కూడా అన్నీ ఇన్నీ కాదు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు ఈ జంట బాగానే కలిసున్నారు. ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2014 లో ఈ జంట విడిపోయింది. కొన్నాళ్ల తర్వాత శ్రీజ వేరే వివాహం చేసుకుంది. ఇక శిరీష్ బీజేపీ పార్టీలో చేరి.. కొన్నాళ్ళు యాక్టివ్ గా పనిచేశాడు.

ఆ తర్వాత సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా పెట్టుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే కొన్నాళ్లుగా ఇతను లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్నాడు. ఇటీవల శ్వాస పీల్చుకోవడంలో మరింత ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఇతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

చికిత్స పొందుతూనే ఈయన బుధవారం నాడు ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తుంది. నిండా 40 ఏళ్ళు కూడా లేని శిరీష్ భరద్వాజ్ కన్నుమూయడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇతని మరణ వార్త వల్ల.. శ్రీజ మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.