March 21, 202502:55:58 AM

Chiranjeevi , Pawan Kalyan: ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి చిరు ఇంటికి వెళ్లిన పవన్.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.!

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ‘జనసేన’ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి.. క్లీన్ స్వీప్ చేసింది జనసేన. అలాగే జనసేన సపోర్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూడా ఘన విజయం సాధించడంతో.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా వ్యవహరించారు అని చెప్పాలి. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మంగళగిరి వంటి ఏరియాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే.

ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈరోజు తొలిసారి చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్. దీంతో మెగా ఫ్యామిలీ అతనికి ఘన స్వాగతం పలికింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కారు దిగడంతోనే రాంచరణ్ (Ram Charan) ఎదురెళ్లి పవన్ కళ్యాణ్ ను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం వరుణ్ తేజ్ (Varun Tej) కూడా వెళ్లి పవన్ ని సంతోషంగా హత్తుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కి తన వదిన సురేఖ, తల్లి అంజలీ దేవి హారతి ఇచ్చి స్వాగతం పలకడమే కాకుండా నరదిష్టి కూడా తీశారు.

అటు తర్వాత పవన్ కళ్యాణ్.. చిరంజీవికి ఎదురు రాగా, ఎమోషనల్ అయిన పవన్ చిరు కాళ్ళ పై పడటం, చిరు ఆనందంతో మురిసిపోవడం అనేది అభిమానులకి మంచి హై ఇచ్చే విషయం. అటు తర్వాత వదినమ్మ సురేఖ, తల్లి అంజలీదేవి..ల కాళ్ళ పై కూడా పడి పవన్ కళ్యాణ్ తన ప్రేమను చాటుకున్నాడు. అలాగే పవన్ సతీమణి అనా కొణిదెల సైతం చిరు కాళ్ళ పై పడింది.

అటు తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి.. పవన్ తో కేక్ కట్ చేయించి విజయోత్సాహంలో మునిగితేలారు అని చెప్పాలి. ఈ వీడియో పవన్ అభిమానులకి మాత్రమే కాదు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కి ఓటేసిన వారందరికీ కన్నుల పండుగలా అనిపించే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.