March 22, 202507:31:37 AM

Deepika Padukone: దీపిక ‘బేబీ బంప్‌’.. ఎన్ని కవరింగ్‌లో చూశారా!

ప్రముఖ కథానాయిక దీపిక పడుకొణె (Deepika Padukone) గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు అఫీషియల్‌ ఈ విషయం చెప్పలేదు కానీ.. ఆమెను చూస్తే, బేబీ బంప్‌ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇటీవల ముంబయిలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా బేబీ బంప్‌తో దీపిక పడుకొణెను చూశాం కూడా. అయితే ఆ ఈవెంట్‌ను, అంతకుముందు ఆమె చేసిన సోషల్‌ మీడియా పోస్టులో చూస్తే ఆ విషయం చెప్పలేదు.

కావాలంటే మీరే చూడండి.. ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దీపిక స్టేజీ మీదకు ఎంట్రీ ఇచ్చినప్పుడు రానా మాట్లాడుతూ ‘ఏంటీ ఇంకా క్యారెక్టర్‌లోనే ఉన్నావా?’ అని అడిగితే.. అవును అని చెప్పింది దీపిక. ఆ తర్వాత మరోసారి అందరూ స్టేజీ మీదకు వచ్చినప్పుడు ‘ప్రభాస్‌ (Prabhas) బాగా భోజనం బాగా పెట్టీ పెట్టీ ఇలా పొట్ట వచ్చేసింది’ అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. దీంతో ఏంటి దీపిక ఇలా మాట్లాడుతోంది అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

అంతేనా అంటే.. ఈ ఈవెంట్‌కి ఆమె వేసుకొచ్చిన బ్లాక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘ఇక చాలు ఆకలేస్తోంది’ అంటూ కామెంట్‌ పెట్టింది. దీంతో అక్కడ కూడా అసలు విషయం కూడా చెప్పలేదు. దీంతో బేబీ బంప్‌ చూపిస్తోంది కానీ.. ఎందుకు అసలు విషయం దాస్తోంది అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఆమె ఏదో సరదాకి చేస్తోంది అని అంటున్నారు.

అయితే, ఇప్పుడు ఆమె బేబీ బంప్‌తో బయటకు రావడం వల్ల ‘సరోగసీ చర్చ’కు ముగింపు పలికినట్లు అయింది. ఎందుకంటే రణ్‌వీర్‌ – దీపిక సరోగసీ ద్వారా బిడ్డను కంటున్నారు అనే ఓ పుకారు గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా బయటకు రావడం వల్ల ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లు అయింది. మరి అసలు విషయం ఎప్పుడు చెబుతారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.