March 23, 202505:19:56 AM

Devara: ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్న తారక్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సమ్మర్ సెలవులను దేవర కచ్చితంగా క్యాష్ చేసుకుంటుందని భావించిన అభిమానులు భావించగా సినిమా వాయిదా పడటం వల్ల అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే దేవర టీమ్ కు తారక్ చేసిన సూచనలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆగష్టు నెల చివరి నాటికి దేవర సినిమాకు సంబంధించిన ఏ పని కూడా బ్యాలెన్స్ ఉండకూడదని తారక్ చెప్పారట.

తారక్ చెప్పిన ఈ సూచనల వల్ల దేవర సినిమా బ్యాలెన్స్ పనులు శరవేగంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. దేవర సినిమాకు సంబంధి తారక్ తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల పార్టీకి మంచి జరగనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కుతోంది. దేవర సినిమా ప్రీ పోన్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రీపోన్ అవుతుందని అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. కొరటాల శివ (Koratala Siva) సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఆచార్య (Acharya) మాత్రమే ఫ్లాప్ అనే సంగతి తెలిసిందే. ఇకపై కొరటాల శివ వరుస విజయాలు సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

దేవర సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు దేవర సీక్వెల్ థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలు పూర్తైన తర్వాత మాత్రమే దేవర2 సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.