March 26, 202508:24:21 AM

Jani Master: ఆ ఆరోపణలపై స్పందించిన జానీ మాస్టర్.. ప్రూవ్ చేస్తే రాజీనామా అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ (Jani Master)  ఒకరు. జానీ మాస్టర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ తనకు ఆఫర్లు రాకుండా చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సతీష్ తెలంగాణలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజావాణి ద్వారా పవన్ కు (Pawan Kalyan)  సైతం జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు.

ఈ ఆరోపణలు ఎక్కువ కావడంతో జానీ మాస్టర్ వీటి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. పవన్ కు మాట రాకూడదనే ఆలోచనతో మీటింగ్ ఏర్పాటు చేశానని జానీ మాస్టర్ పేర్కొన్నారు. సతీష్ ఆరోపణలు నిజమని ప్రూవ్ అయితే తన పదవికి రాజీనామా చేస్తానని కోరియోగ్రఫీ వదులుకుంటానంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలుగు టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు జానీ మాస్టర్ అధ్యక్షునిగా ఉన్నారు.

డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం కొంత భూమిని కొనుగోలు చేయగా దానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని జానీ మాస్టర్ వెల్లడించారు. యూనియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చరణ్ (Ram Charan)  , ఉపాసనలతో మాట్లాడామని ఆయన తెలిపారు. యూనియన్ లో మాట్లాడిన విషయాలను సతీష్ స్టేటస్ పెట్టాడని ఆ స్టేటస్ తీసేయమని అడిగితే సతీష్ దుర్బాషలాడారని జానీ మాస్టర్ వెల్లడించారు.

యూనియన్ లో చర్చిస్తే సతీష్ తన తప్పుని ఒప్పుకున్నారని జానీ మాస్టర్ తెలిపారు. యూనియన్ రూల్స్ ప్రకారం సతీష్ కు జరిమానా విధించామని ఆయన అన్నారు. ఆ తర్వాత సతీష్ బెదిరింపులకు పాల్పడ్డాడని జానీ మాస్టర్ పేర్కొన్నారు. పవన్ కు, పవన్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నాను కాబట్టి వివరణ ఇస్తున్నానని జానీ మాస్టర్ తెలిపారు. జానీ మాస్టర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.