March 20, 202504:40:45 PM

Kalki 2: కల్కి2 మూవీలో ఆ సెలబ్రిటీలు గెస్ట్ రోల్స్ లో కనిపించే ఛాన్స్ ఉందా?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) సినిమా సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో ఏకంగా ఏడుమంది టాలీవుడ్ సెలబ్రిటీలు గెస్ట్ రోల్స్ లో నటించారు. అయితే కల్కి సినిమాలో కనిపించని సెలబ్రిటీలలో కొందరు కల్కి సీక్వెల్ లో కనిపించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సమంత (Samantha) , రష్మిక (Rashmika Mandanna) , నాని (Nani) కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్ సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు.

వీళ్లు కల్కి2 లో గెస్ట్ రోల్స్ లో కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాలో గెస్ట్ రోల్ అవకాశాన్ని సైతం వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరనే సంగతి తెలిసిందే. కల్కి2 సినిమా 40 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కల్కి1 ట్రైలర్ లాంటిదని కల్కి2 అసలు సినిమా అని కల్కి2 ఊహలకు అందని విధంగా అద్భుతంగా ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న కల్కి సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అద్భుతాలు చేస్తోంది. వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు బాగానే ఉంటే కల్కి మూవీ దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు వేయడం కష్టమని చెప్పవచ్చు. ప్రస్తుతం థియేటర్లలో సినిమా చూడాలని భావించే వాళ్లకు సైతం కల్కి మూవీ ఫస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ గా నిలవనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కల్కి మూవీ ఫుల్ రన్ కలెక్షన్ల గురించి మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రభాస్ సక్సెస్ రేట్ పెరగడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కల్కి సినిమాకు ప్రమోషన్స్ లో వేగం పెంచాలని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.