March 21, 202501:11:10 AM

Kalki 2898 AD: ‘కల్కీ’ గురించి దర్శకుడు చెప్పిన షాకింగ్ విషయాలు..!

ప్రభాస్  (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) కోసం దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ .. కథ, కథనాలు ఏంటి అనేదాని పై అందరిలో చాలా డౌట్లు ఉన్నాయి. తాజాగా వాటిపై దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) క్లారిటీ ఇచ్చాడు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పటి నుండి ‘పాతాళ భైర‌వి’, ‘భైర‌వ ద్వీపం’ (Bhairava Dweepam) , ‘ఆదిత్య 369 ‘ (Aditya 369) వంటి సినిమాలు అంటే ఇష్టం.

హాలీవుడ్లోని ‘స్టార్ వార్స్’ వంటి సినిమాలు కూడా నచ్చుతాయి. అయితే అవి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే కథలు కావు. కానీ మన నేటివిటీలో స్టార్ వార్స్ వంటి సినిమా తీయాలంటే ఏం చేయాలి? ఎలా తీయాలి? అనే ఆలోచనల నుండి పుట్టిందే ఈ `క‌ల్క 2898 ad` చిత్రం. ప్రతి యుగంలో ఓ రాక్ష‌సుడు పుడ‌తాడు అనేది ఎంత నిజమో… ఆ రాక్షసుడిని అంతం చేయ‌డానికి దేవుడు కూడా వేరే అవ‌తారం ఎత్తుతాడు అనేది కూడా అంతే నిజం.

పురాణాల‌ ఇతివృత్తం ఇదే కదా. క‌లియుగంలోనూ అలాంటి క‌థే ఉంటుంది.. ఈ యుగం ఎలా అంతం అవుతుంది? ఆ టైంలో జరిగే సంఘటనలు ఏంటి.? అనేదాన్ని హైలెట్ చేస్తూ స్క్రీన్ ప్లే డిజైన్ చేశాను. ఈ క‌థ కోసం ఐదేళ్లు పనిచేశాను. అలాగే ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా రూ.500 కోట్ల వరకు పెట్టడం జరిగింది. విజువల్స్ అందరికీ మంచి ఫీల్ కలిగిస్తాయి” అంటూ చెప్పుకొచ్చాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.