March 16, 202511:32:18 AM

Kalki Movie: క్లీంకారకు బుజ్జి గిఫ్ట్.. ప్రమోషన్స్ వేరే లెవెల్ అంటూ?

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  డైరెక్షన్ లో నటిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే బుజ్జి కారును ప్రధాన నగరాల్లో తిప్పుతూ చిత్రయూనిట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే రామ్ చరణ్ (Ram Charan) కూతురు క్లీంకారకు కల్కి టీమ్ బహుమతిని పంపగా ఆ బహుమతిని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పిల్లలకు కల్కి టీమ్ గిఫ్ట్ లు అందుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

క్లీంకారకు బుజ్జి భైరవ స్టిక్కర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. బొమ్మలతో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అదే సమయంలో ఉపాసన కల్కి టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం గమనార్హం. కల్కి ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్ ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ను తీసుకొనిరాగా ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొణే నటిస్తున్నారు.

సీనియర్ హీరో కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. పశుపతి, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కల్కి సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాతో థియేటర్లు మళ్లీ కళకళలాడే ఛాన్స్ అయితే ఉంటుంది.

రికార్డ్ స్థాయి స్క్రీన్లలో కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ రాజమౌళి (Rajamouli) రేంజ్ దర్శకుడో కాదో ఈ సినిమాతో జవాబు దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తితోనే ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది. కల్కి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.