March 16, 202511:42:46 AM

Kamal Haasan: 28 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పిన కమల్‌హాసన్‌… ఇంత జరిగిందా!

‘భారతీయుడు’ / ‘ఇండియన్‌’ సినిమా వస్తున్నప్పుడు అంతటి పెద్ద విజయం సాధిస్తుందని, అన్ని రికార్డు వసూళ్లు అందుకుంటుంది అని ఎవరూ ఊహించి ఉండరు. ఏదో స్టార్‌ హీరో సినిమా అని అనుకుంటే అదో పాత్‌ బ్రేకింగ్‌ సినిమాగా మారిపోయిది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్స్‌ రెడీ అయ్యాయి. అందులో భాగంగా ‘ఇండియన్‌ 2’(Indian 2) త్వరలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ ఆడియో ఫంక్షన్‌ను ఏర్పాటు చేసింది. ఆ వేదిక మీద కమల్‌ (Kamal Haasan) చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి.

‘భారతీయుడు’ పుట్టిన విధానం గురించి కూడా ఆయన మాట్లాడారు. 28 ఏళ్ల క్రితం ‘ఇండియన్’ సినిమా సమయంలోన శివాజీ గణేశన్‌తో (Sivaji Ganesan) కమల్‌ ఓ సినిమా చేయాలట. ఆయన చెప్పిన కథ, శంకర్‌ (Shankar)  చెప్పిన కథ దగ్గరదగ్గరగా ఉన్నాయట. అదే విషయాన్ని శివాజీ గణేశన్‌తో చెబితే ‘శంకర్‌తోనే సినిమా చేయండి’ అని అన్నారట. ఆయన అన్న ఆ మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్‌తో ‘ఇండియన్’ సినిమా చేశాను అని కమల్‌ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.

‘భారతీయుడు’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో కమల్‌, శంకర్ రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడుకోలేదట. అయితే ఆ టైంలోనే శంకర్‌తో ఆ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారట కమల్‌. కానీ కథ రెడీగా లేదని శంకర్ అన్నారట. ఇప్పుడు అంటే 28 ఏళ్ల తరువాత ‘ఇండియన్ 2’ చేశాం అని కమల్‌ చెప్పారు. ఇక ‘ఇండియన్’ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఇక ఈ సినిమాతోపాటు ‘ఇండియన్‌ 3’ని కూడా సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చాక ఆ పార్ట్‌ పనులు స్పీడప్‌ చేసే పరిస్థితి లేదు. రామ్‌ చరణ్‌  (Ram Charan) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) పనులు పూర్తయ్యాక శంకర్‌ టీమ్‌ తిరిగి ‘ఇండియన్‌ 3’ పనులు మొదలుపెడుతుంది అంటున్నారు. ‘ఇండియన్‌ 2’ అయితే జులై 12న వస్తున్నాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.