March 19, 202511:24:13 AM

Klin Kaara: క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కలిసొస్తుందిగా.. ఏం జరిగిందంటే?

ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే జనసేన సక్సెస్ కు క్లీంకార సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్లీంకార రియల్ గేమ్ ఛేంజర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. క్లీంకార పుట్టిన తర్వాత చిరంజీవికి (Chiranjeevi) పద్మవిభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే. క్లీంకార పుట్టిన తర్వాత ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.

చిరంజీవి, చరణ్ (Ram Charan) లకు క్లీంకార వల్ల అదృష్టం కలిసొచ్చిందని కామెంట్లు వినిపించగా ఈ ఎన్నికల్లో పవన్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన నుంచి పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి విజయం దక్కింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలలో విజయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవన్ పేరు మారుమ్రోగుతోంది. పవన్ కు దక్కిన విజయం సాధారణ విజయం కాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

క్లీంకార మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతున్నాయని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ త్వరలో తన సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. మరో నెల రోజుల వరకు పవన్ కళ్యాణ్ షూటింగ్ లలో పాల్గొనే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండగా పవన్ సినిమాలు, రాజకీయాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన సినిమాలు సైతం ఖచ్చితంగా సక్సెస్ సాధించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.