March 29, 202504:07:02 PM

Mahesh Babu: బాబు, పవన్ విజయంపై మహేష్ ట్వీట్ వైరల్.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం ఆ పార్టీ అభిమానులకు ఊహించని స్థాయిలో సంతోషాన్ని కలిగించింది. 164 ఎమ్మెల్యే సీట్లు, 21 ఎంపీ సీట్లతో కూటమి ఏపీలో ప్రభంజనం సృష్టించింది. టీడీపీ విక్టరీపై సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ సీఎం కాబోతున్న చంద్రబాబు గారికి శుభాకాంక్షలు మహేష్ బాబు తెలిపారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని మహేష్ బాబు పేర్కొన్నారు. అదే సమయంలో పవన్ విజయం గురించి కూడా మహేష్ బాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అద్భుతమైన విజయానికి అభినందనలు అని ఆయన వెల్లడించారు. ప్రజలు పవన్ పై ఉంచిన విశ్వాసం మరియు నమ్మకానికి ఈ విజయం నిదర్శనం అని మహేష్ బాబు అన్నారు.

ప్రజల కోసం మీరు కన్న కలలను నిజం చేయాలని కోరుకుంటున్నానని మహేష్ బాబు అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూటమి విక్టరీ గురించి రియాక్ట్ అయిన కొన్ని గంటల్లోనే మహేష్ బాబు కూడా రియాక్ట్ కావడం గమనార్హం. కూటమి గెలుపు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీలో కూటమి విజయం సాధిస్తుందని చాలామంది భావించినా ఈ స్థాయిలో మెజారిటీ మాత్రం ఊహించలేదు. ఏపీలో మరో ఐదేళ్ల పాటు కూటమికి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే ఈ హీరో తర్వాత మూవీ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.