April 10, 202505:55:59 PM

Mamta Mohandas: మమతా మోహన్ దాస్ బాధలో న్యాయముందిగా.. ఆ హీరోయిన్ తప్పు చేసిందా?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సింగర్ గా, నటిగా మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మమతా మోహన్ దాస్ గాత్రానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మహారాజ సినిమాలో నటించి ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న మమతా మోహన్ దాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రజనీకాంత్ (Rajinikanth) హీరో కుసేలన్ (Kuselan) మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తెలుగులో కథనాయకుడు పేరుతో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

కుసేలన్ సినిమాలో ఒక సాంగ్ లో తాను చేశానని రెండు రోజుల పాటు తాను షూట్ కు వెళ్లానని అయితే ఎడిటింగ్ లో నా పార్ట్ మొత్తం డిలేట్ చేసి సినిమాలో కేవలం ఒకే ఒక్క సెకన్ మాత్రమే చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ రిలీజ్ తర్వాత ఆ సాంగ్ చూసి బాధ పడ్డానని, ఎంతో ఫీలయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకు రజనీకాంత్ సినిమాలో తాను నటించానా అని అనిపించిందని మమతా మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు.

2008 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నయనతార వల్లే మమతా మోహన్ దాస్ పార్ట్ ను కట్ చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరో హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే తాను షూటింగ్ కు రానని అప్పట్లో నయనతార (Nayanthara) దర్శకనిర్మాతలకు చెప్పారట. మమతా మోహన్ దాస్ కు జరిగింది అన్యాయమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మమతా మోహన్ దాస్ కు తెలుగులో యమదొంగ (Yamadonga) సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నటి తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మమతా మోహన్ దాస్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.