March 23, 202505:53:10 AM

Manamey: మనమే సినిమాలో నటించిన ఈ చైల్డ్ యాక్టర్ ఎవరి కొడుకో తెలుసా?

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ మెప్పించిన ట్రైలర్లలో మనమే (Manamey)  మూవీ ట్రైలర్ ఒకటి. శర్వానంద్ (Sharwanand) , కృతిశెట్టి (Krithi Shetty) ఈ సినిమాలో కలిసి నటించగా మనమే సినిమాతో తమకు బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని అటు శర్వానంద్ ఇటు కృతి భావిస్తున్నారు. అయితే ట్రైలర్ లో మెరిసిన బుడ్డోడు విక్రమ్ ఆదిత్య ఎవరి కొడుకు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. విక్రమ్ ఆదిత్య చాలా క్యూట్ గా ఉన్నాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ బుడ్డోడు ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) కొడుకు కావడం గమనార్హం. లాంగ్ హెయిర్ తో ఈ బుడ్డోడు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. 2020 సంవత్సరంలో శ్రీరామ్ ఆదిత్య దంపతులకు విక్రమ్ ఆదిత్య జన్మించాడని ప్రస్తుతం ఈ బుడ్డోడి వయస్సు 4 సంవత్సరాలు అని తెలుస్తోంది. మనమే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిస్తే మాత్రం విక్రమ్ ఆదిత్య కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరగగా కృతిశెట్టి తన ఆటిట్యూడ్ కు భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. శర్వానంద్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీరామ్ ఆదిత్య ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. మనమే సినిమాతో శ్రీరామ్ ఆదిత్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.