March 20, 202505:05:50 PM

Manamey: రియల్‌ లైఫ్‌ విషయాలు చాలానే ‘మనమే’లో చూస్తారట.. ఎవరివంటే?

‘మనమే’ (Manamey) సినిమా ప్రచార చిత్రాలు చూసినప్పుడు ఏదో కొత్త ప్రయత్నం అనే ఫీలింగ్‌ కచ్చితంగా కలుగుతుంది. యంగ్‌ జంట, ఓ బిడ్డతో వైవిధ్యంగా కనిపించింది ఆ ప్రమోషనల్‌ కంటెంట్‌. రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య (Sriram Adittya) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సరదా కామెడీతో ముగ్గురి చుట్టూ సాగే ఓ ఆహ్లాదభరితమైన కథ అని చెప్పిన ఆయన సంభాషణల వెనుక కథ కూడా చెప్పారు.

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల భావోద్వేగాల్ని విభిన్నంగా చెప్పాలనే ఆలోచనతో ఈ సినిమా కథ పుట్టింది అని శ్రీరామ్‌ ఆదిత్య తెలిపారు. ఇలాంటి కథను సిద్ధం చేసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉందని, హాస్యం ప్రధానంగా ఈ కథ చెప్పాలనే ఆలోచనతో ఈ సినిమా చేశానని చెప్పాడు. పిల్లల్లో ఓ అమాయకత్వం కనిపిస్తుందని, దాన్ని టచ్‌ చేస్తూ ఈ సినిమా చేశానని చెప్పారాయన. తన జీవితంలో నుండి వచ్చిన డైలాగ్సే ఈ సినిమాలో ఉన్నాయని చెప్పిన శ్రీరామ్‌ ఆదిత్య..

ట్రైలర్‌లోనూ చూపించాను అని చెప్పారు. తల్లిదండ్రులతో తనకు ఎటాచ్‌మెంట్‌ ఎక్కువని, తనకు బాబు పుట్టాక ఆ ఎటాచ్‌మెంట్‌ ఇంకా పెరిగిందని చెప్పిన శ్రీరామ్‌ ఆదిత్య.. అలాంటి సమయంలో పుట్టిన ఆలోచనే ఈ కథ అని అన్నారు. తన సినిమాల్లో తెరపై ఉత్సాహంగా కనిపిస్తారని, ఇందులో కూడా శర్వా అలాగే కనిపిస్తాడని చెప్పారు. శర్వాకు (Sharwanand) , కృతి శెట్టికి (Krithi Shetty)  మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సీన్స్‌ ఉంటాయని చెప్పారు శ్రీరామ్‌ ఆదిత్య.

రిలీజ్‌ అయ్యాక సినిమా ఫలితం మాటెలా ఉన్నా, శ్రీరామ్‌ ఆదిత్య సినిమాలు బాగుంటాయనే కారణంతోనే హీరోలు తనపై నమ్మకం చూపిస్తున్నారామో అని అన్నారు శ్రీరామ్‌. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి ఆలోచనతోనే చేశాం అని చెప్పారు శ్రీరామ్‌ ఆదిత్య. మరి సినిమాలో ఆయన నిజ జీవిత స్ఫూర్తి సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.