March 20, 202511:27:21 PM

Nag Ashwin: నాగ్ అశ్విన్ కు ఇష్టమైన బాలయ్య సినిమాలు ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవడే సుబ్రహ్మణ్యం (Yevade Subramanyam) , మహానటి (Mahanati) సినిమాలతో దర్శకునిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో కెరీర్ పరంగా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. కల్కి ప్రమోషన్స్ లో భాగంగా వరుస అప్ డేట్స్ ఇస్తున్న నాగ్ అశ్విన్ ఈ అప్ డేట్స్ లో చెబుతున్న విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ నాగ్ అశ్విన్ ఒక వీడియోను రిలీజ్ చేశారు.

నాకు బాల్యం నుంచి పౌరాణిక సినిమాలు అంటే ఇష్టమని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. పాతాళభైరవి నాకు ఇష్టమైన సినిమా అని ఆయన కామెంట్లు చేశారు. భైరవద్వీపం (Bhairava Dweepam)  , ఆదిత్య 369 (Aditya 369)  , హాలీవుడ్ స్టార్ వరల్డ్ సినిమాలు సైతం నన్ను ఆకట్టుకున్నాయని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ ను ఆకట్టుకున్న సినిమాల్లో రెండు సినిమాలు బాలయ్య (Nandamuri Balakrishna)  సినిమాలు కావడం గమనార్హం. ఈ విషయాలు తెలిసి బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

మరోవైపు కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) సైతం తన వంతు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. కల్కి 2898 ఏడీ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయమని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో దీపికా పదుకొనే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ప్రభాస్ కు (Prabhas) జోడీగా ఈ సినిమాలో దిశా పటానీ (Disha Patani)  కనిపించనున్నారు. దిశా పటానీ ఈ సినిమాలో రోక్సీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. 600 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.