March 24, 202508:34:00 AM

Nayanthara: పిల్లలతో ‘బాహుబలి’ సీన్‌ రీక్రియేట్‌.. నయనతార ఫొటోలు వైరల్‌!

‘బాహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ (Ramya Krishnan) ‘మహేద్ర బాహుబలి’ని రెండు చేతులతో పెకి ఎత్తి సరస్సులో అలా నిల్చుని ఉంటుంది. ఆ సీన్‌ చూశాక చప్పట్లు కొట్టనివాళ్లు ఉండరు, ఈలలు వేయనివాళ్లు ఉండరు. అంతలా అదిరిపోయింది సన్నివేశం. ఇప్పుడు అదే సీన్‌ను రీక్రియేట్‌ చేసింది నయనతార (Nayanthara) – విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) జోడీ. దానికి సంబంధించి ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ – నయనతార.

ఇటీవల రెండో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా విదేశాల్లో జరుపుకున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలను షేర్‌ కూడా చేశారు. అలా ఇటీవల విఘ్నేశ్ శివన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘బాహుబలి’ సినిమాలో చిన్నారిని రమ్యకృష్ణ నీళ్లలో ఎత్తుకున్నట్టుగా.. పిల్లలిద్దరినీ విఘ్నేశ్ నీళ్లలో నిల్చుని చేతులతో ఎత్తుకున్నారు. అలా తనయులు ఉయిర్‌, ఉలగమ్‌ను చేతులతో పైకి ఎత్తిపట్టుకుని ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘మై డియర్ బాహుబలి 1 (Baahubali), బాహుబలి 2 (Baahubali 2) .. మీ రాకతో నా జీవితం ఆనందంగా మారిపోయింది. లవ్ యూ’ అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. దానికి నెటిజన్లు సరదా కామెంట్లు యాడ్‌ చేస్తున్నారు. ఒకరు హీరో, మరొకరు డైరక్టరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫాదర్స్ డే సందర్భంగా నయనతార పెట్టిన పోస్ట్‌ కూడా ఆకట్టుకుంటోంది. ‘‘ప్రపంచంలోని ఉత్తమ నాన్నకు శుభాకాంక్షలు. పిల్లలపై నీ ప్రేమ చూస్తే ముచ్చటేస్తుంది. నీతో కలసి జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని నయనతార ఆ పోస్టులో పేర్కొన్నారు.

సరోగసీ ద్వారా గతేడాది ఉయిర్‌, ఉలగ్‌కు నయన్‌ – విఘ్నేశ్‌ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇలా ఫొటోలతో అభిమానులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు నయన్‌జోడీ. ఇక నయన్‌ సినిమాల గురించి చూస్తే.. ఆమె చేతిలో ‘టెస్ట్‌’, ‘మన్నన్‌గట్టి సిన్స్‌ 1960’, ‘డియర్‌ స్టూడెంట్స్‌’, ‘తని ఒరువన్‌ 2’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలతోపాటు మమ్ముట్టి సినిమా, విష్ణు ఎడవన్‌ సినిమా లైనప్‌లో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.