March 28, 202502:57:33 AM

OG Movie: ఓజీ ప్రమోషన్స్ మొదలు.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడేనా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ (OG Movie) ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదలవుతుందని ప్రేక్షకులు భావించినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ (S.S.Thaman) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అరైవ్డ్ ఫర్ ఓజీ బ్లాస్ట్ అంటూ థమన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. థమన్ ట్వీట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అతి త్వరలోనే ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని థమన్ ట్వీట్ తో అర్థమవుతుండగా ఓజీ ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కూడా త్వరలో వస్తుందేమో చూడాల్సి ఉంది. ఓజీ ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ మొదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

ఓజీ సినిమాలో శ్రియారెడ్డి (Sriya Reddy) కీలక పాత్రలో నటిస్తుండగా వెంకట్ (Venkat) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఓజీ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కథ, కథనం కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.

ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఓజీ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. పవన్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా డిజిటల్ రైట్స్ వల్లే ఈ మూవీ ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.