March 21, 202512:51:52 AM

Pawan Kalyan: పవర్ స్టార్ గురించి ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాధించిన సంచలన విజయం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు నేషనల్ వైడ్ గా తన పేరు మారుమ్రోగేలా చేసుకోవడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది కదా రియల్ పాన్ ఇండియా క్రేజ్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమికి 164 స్థానాల్లో విజయం దక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పవన్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అంటూ గతంలో సముద్రఖని చేసిన కామెంట్స్ నిజమయ్యాయని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. సినిమాల ద్వారా కాకుండా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సాధించడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇది సాధ్యమైందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఓజీ రైట్స్ ఏకంగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని పవన్ కళ్యాణ్ క్రేజ్ కు ఇది నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ సినిమాలు పాన్ ఇండియా హిట్లు కావడం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారు.

ఊహించని స్థాయిలో సక్సెస్ వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం పొంగిపోకుండా కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తో సినిమాలు తీయాలని ఆశ పడుతున్న దర్శకుల సంఖ్య పెరుగుతోంది. పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.