March 25, 202511:44:35 AM

Pawan Kalyan: అభిమానులకి పవన్.. పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడా?

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేన పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. అంతా బాగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. అందులో క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో చేయాల్సిన ‘హరి హర వీరమల్లు’  (Hari Hara Veera Mallu), సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో చేయాల్సిన ‘ఓజి’ (OG Movie) , హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో చేయాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) వంటివి ఉన్నాయి.

‘హరి హర వీరమల్లు’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు తీసిన ఫుటేజ్ పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవటం వల్ల రీషూట్లు చేస్తారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) టైంలో కమిట్ అయిన సినిమా ఇది. నిర్మాత ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై భారీగా ఖర్చు పెట్టారు. అలాగే భారీగా ఇంట్రెస్టులు కడుతున్నారు. కాబట్టి మొదట ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. తర్వాత ‘ఓజీ’ ‘ఉస్తాద్ భగత్’ సింగ్ లను కంప్లీట్ చేస్తారు.

ఇదిలా ఉండగా.. ఈ 3 సినిమాలు కంప్లీట్ చేశాక, సినిమాలకి మళ్ళీ గ్యాప్ ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు ఇంకో 3 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి.. జనాలకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ 3 పూర్తి చేశాక ఆయన సినిమాలకి గ్యాప్ ఇస్తారట. అందుకే దర్శకుడు సుధీర్ వర్మతో (Sudheer Varma) చేయాల్సిన ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.