March 19, 202501:46:55 PM

Pawan Kalyan: పవన్ కు ఈ నంబర్ ఎంతో కలిసొచ్చిందా.. ఏం జరిగిందంటే?

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  జనసేనతో ఎవరికీ సాధ్యం కాని ఫలితాలను సొంతం చేసుకున్న అంగతి తెలిసిందే. పవన్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు దక్కడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. పవన్ కు సచివాలయంలో తాజాగా ఛాంబర్ ను కేటాయించగా సచివాలయంలోని రెండో బ్లాకు మొదటి అంతస్తులో గదిని కేటాయించడం జరిగింది. ఆ గది నంబర్ 212 కాగా పవన్ కళ్యాణ్ ఈ గది నుంచి సమీక్షలను నిర్వహించనున్నారని నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారని సమాచారం.

పవన్ ఛాంబర్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కెరీర్ లో 212 నంబర్ ఎంతో స్పెషల్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఎన్నికల్లో విజయం సాధించారు. పవన్ ఛాంబర్ నంబర్ 212 జనసేన గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను సూచిస్తోందని తెలుస్తోంది.

అందువల్ల 212 నంబర్ పవన్ కు స్పెషల్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు జులై మొదటి వారం నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొననున్నారు. పవన్ మొదట హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాకు ప్రాధాన్యత ఇస్తారని ఈ ఏడాదే ఆ సినిమా విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఓజీ (OG Movie) సినిమాను సైతం వీలైనంత వేగంగా పూర్తి చేసేలా పవన్ ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు ఓకే చెప్పడం మాత్రం కష్టమేనని భోగట్టా. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.