March 19, 202501:47:03 PM

Pawan kalyan: మా కలకు అడుగు దూరంలో పవన్.. అంబటి రాయుడు సెన్సేషనల్ పోస్ట్!

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan kalyan) జనసేన పార్టీతో సాధించిన సంచలన విజయం గురించి మరికొన్ని సంవత్సరాల పాటు ఏపీ ప్రజలు మాట్లాడుకోవడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఎంతో సంతోషిస్తున్నారు. టాలీవుడ్ సమస్యలను ఇకపై ఏపీ ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లు చేశారు.

సీఎంగా పవన్ కళ్యాణ్ ను చూడాలనే తన కలకు అడుగు దూరంలో పవన్ కళ్యాణ్ నిలవడంతో ఎంతో సంతోషంగా ఉందని అంబటి రాయుడు అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్ కళ్యాణ్ కు అభినందనలు అని అంబటి రాయుడు కామెంట్లు చేశారు. భవిష్యత్తులో పవన్ ను సీఎంగా చూడాలనే నా కలకు కేవలం అడుగు దూరంలో ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు నిజంగా పండ‌గ రోజు అని అంబటి రాయుడు ట్వీట్ లో పేర్కొన్నారు. అంబటి రాయుడు చేసిన ఈ పోస్ట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో పవన్ సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా మాట్లాడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ పాలనలో కూడా తన మార్క్ చూపించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను వేగంగా పూర్తి చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను మరింత పెంచుకుని మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ambati Rayudu (@a.t.rayudu)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.