March 23, 202505:36:44 AM

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే హీరోయిన్లు ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్ కు కు ఇన్ స్టాగ్రామ్ లో 12.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో కేవలం 18 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఈ 18 మందిలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. ఈ ఆరుగురు హీరోయిన్ల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కృతిసనన్ (Kriti Sanon) , శృతి హాసన్ (Shruti Haasan), దీపికా పదుకొనే (Deepika Padukone) , సీనియర్ నటి భాగ్యశ్రీ (Bhagyashree), పూజా హెగ్డే (Pooja Hegde), శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) లను మాత్రమే ప్రభాస్ ఫాలో అవుతున్నారు. ఈ ఆరుగురు హీరోయిన్లు ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలలో నటించిన హీరోయిన్లు కావడం గమనార్హం. స్టార్ హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి ఇష్టపడరు. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రభాస్ నటించిన కల్కి (Kalki 2898 AD) మూవీ రిలీజ్ కు సరిగ్గా మూడు వారాల సమయం ఉంది. ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ కావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కల్కి మూవీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఏడేళ్ల క్రితం బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రభాస్ కల్కి సినిమాతో అంతకు మించి మ్యాజిక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కల్కి 2898 ఏడీలో ఒక సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ కూడా ఎంతో స్పెషల్ గా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిజినెస్ పరంగా అదరగొట్టిన ప్రభాస్ కలెక్షన్స్ పరంగా కూడా అదరగొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో ఇతర పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్ల స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.