March 29, 202504:20:14 PM

Pushpa 2: పుష్ప2 రిలీజ్ విషయంలో గందరగోళం.. మేకర్స్ చెప్పింది నిజమేనా?

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్  (Sukumar)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule)  మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)  సినిమాను ఆగష్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడటంతో పుష్ప2 ఆ తేదీకి రిలీజ్ కావడం లేదని క్లారిటీ వచ్చేసింది. అయితే పుష్ప2 వాయిదా పడితే మాత్రం డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంటుంది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదలైతే ఆ ప్రభావం చైతన్య (Naga Chaitanya)  తండేల్  (Thandel) , నితిన్  (Nithiin) రాబిన్ హుడ్ (Robinhood)  సినిమాలపై పడుతుంది.

ఈ సినిమాలలో తండేల్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ సినిమా అనే సంగతి తెలిసిందే. మరోవైపు పుష్ప2 ఆగష్టు 15వ తేదీనే విడుదల అవుతుందనే విధంగా ఈ నెల 14వ తేదీన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు షేర్ చేసిన పోస్టర్ లో పేర్కొన్నారు. అందువల్ల పుష్ప2 రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సినిమా కోసం రావు రమేష్ (Rao Ramesh) డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నారని వార్తలు వినిపించాయి.

పుష్ప2 మేకర్స్ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి సందేహాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పుష్ప2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరుగుతోంది. బన్నీ మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పట్టుదలతో ఉన్నారని చెప్పిన తేదీకే ఈ సినిమా విడుదల కావాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పుష్ప2 ఇండిపెండెన్స్ డేను మిస్ చేసుకుంటే ఈ సినిమాకు అలాంటి మంచి డేట్ దొరకడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా యాక్షన్ ప్రియులను సైతం మెప్పించేలా ఉండనుందని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.