April 2, 202501:04:27 AM

Pushpa 2: ‘కపుల్‌ సాంగ్‌’… రీల్స్‌ కురుస్తూనే ఉన్నాయి… రికార్డు స్థాయిలో!

ఓ సినిమాను హుక్‌ స్టెప్‌ ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియాలి అంటే రీసెంట్‌ సినిమాలు ‘పుష్ప’ (Pushpa: The Rise), ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR) ఇలా కొన్ని సినిమాల లిస్ట్‌ చెప్పొచ్చు. ఆ మాటకొస్తే ఇప్పుడు చాలా సినిమాల్లో ఓ పాటలో హుక్‌ స్టెప్పు కచ్చితంగా పెడుతున్నారు. అయితే పైన చెప్పిన రెండు సినిమాల హుక్‌ స్టెప్పులు ప్రపంచవ్యాప్తం అయిపోయాయి. అలా ఇప్పుడు ‘పుష్ప 2’లో ( Pushpa 2: The Rule) కూడా ఓ స్టెప్‌, పాటల వైరల్‌ అవుతున్నాయి. ఏకంగా ఆ స్టెప్‌ను లక్ష మంది నెటిజన్లు చేశారు.

‘కపుల్ సాంగ్‌’ అంటూ ‘పుష్ప 2’ టీమ్‌ నుంచి ఇటీవల ఓ పాట వచ్చింది. మీరు చూసే ఉంటారు, డ్యాన్స్‌ అంటే ఆసక్తి ఉంటే ఆ హుక్‌ స్టెప్‌ వేసే ఉంటారు. అయితే ఇలా స్టెప్‌ వేసి సోషల్ మీడియాలో పెట్టినవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఆ స్టెప్‌ను హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేసిన వీడియోలు లక్షకు పైగా వచ్చాయి అని టీమ్‌ ప్రకటించింది. అన్నీ వైవిధ్యంగానే ఉన్నాయి. అలాగే అందంగానూ ఉన్నాయి.

‘సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామీ..’ అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) స్వరపరచగా.. శ్రేయా ఘోషల్‌ ( Shreya Ghoshal) ఆలపించారు. గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేయగా.. విజయ్‌ పోలాకి, శ్రష్టి వర్మ స్టెప్స్‌ కంపోజ్‌ చేశారు. అందులో అల్లు అర్జున్ (Allu Arjun) , రష్మిక (Rashmika Mandanna) స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. రిహార్సిల్‌ చేసినప్పటి ఫుటేజ్‌ని ఓ మాంటేజ్‌ సాంగ్‌లా సిద్ధం చేసి లిరికల్‌ వీడియోగా అందించింది టీమ్‌. దీనికి మంచి స్పందనే వస్తోంది.

ఇక ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంకా వర్క్‌ చాలా పెండింగ్‌లో ఉందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో టీమ్‌ డబుల్‌, ట్రిపుల్‌ షిఫ్ట్‌లు చేస్తోందని సమాచారం. ‘పుష్ప 1’ రిలీజ్‌ సమయంలో వర్క్‌ పెండింగ్‌ ఉండిపోవడంతో దర్శకుడు సుకుమార్‌ రిలీజ్‌కి ముందు రోజు వరకు ప్రచారంలో పాల్గొనలేకపోయిన సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.