March 27, 202510:10:12 PM

Sai Pallavi: సాయిపల్లవి సీత రోల్ కు కరెక్ట్ కాదు.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు!

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) కెరీర్ చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే సాయిపల్లవి భిన్నమనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి ప్రాజెక్ట్ నచ్చితే మాత్రమే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. సెలెక్టివ్ ప్రాజెక్ట్ లలో మాత్రమే ఈ బ్యూటీ నటిస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణంలో సైతం సాయిపల్లవి నటిస్తున్నారు. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లాహ్రి మాట్లాడుతూ రామాయణంలో రణబీర్ (Ranbir Kapoor)  లుక్ నాకు చాలా బాగా నచ్చిందని అతడు తెలివైన వాడు కాబట్టి తన రోల్ లో పరిపూర్ణంగా నటిస్తాడని పేర్కొన్నారు.

అయితే యానిమల్ (Animal) మూవీ చూసిన తర్వత రణబీర్ ను రాముడిగా అంగీకరించడం కష్టమని ఆయన తెలిపారు. రణబీర్ ను జనాలు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. సాయిపల్లవి గురించి సునీల్ లాహ్రి మాట్లాడూ నటిగా ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదని ఆయన అన్నారు. సాయిపల్లవి నటించిన సినిమాలను నేను ఎప్పుడూ చూడలేదని సునీల్ లాహ్రి పేర్కొన్నారు.

అయితే లుక్స్ పరంగా సాయిపల్లవిలో దేవత లక్షణాలు మాత్రం లేవని ఆయన చెప్పుకొచ్చారు. సునీల్ లాహ్రి చెప్పిన విషయాలు సాయిపల్లవి ఫ్యాన్స్ కు అసహనాన్ని కలిగిస్తున్నాయి. సాయిపల్లవి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అభినయ ప్రధాన పాత్రలకే ఓటేస్తున్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. సాయిపల్లవి ఎక్కువ ప్రాజెక్ట్స్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. సాయిపల్లవి ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు ప్రాణం పోస్తారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాయిపల్లవి భిన్నమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాయిపల్లవి నటిస్తున్న తండేల్ (Thandel) రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.