March 28, 202503:07:03 PM

Samantha, Shah Rukh Khan: హిట్‌ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ షారుఖ్‌.. ఈసారి కూడా సౌత్‌ హీరోయిన్‌!

అనారోగ్యం, వ్యక్తిగత కారణాలు వల్ల సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకున్న తర్వాత సమంత (Samantha) రీఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అయిపోయింది. అయితే ఇటీవల ఆమె తెలుగు సినిమా మొదలుపెట్టింది. అంతకుముందే బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేసింది సామ్‌. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్‌ హీరో సినిమాలో నటిస్తోంది అంటూ వార్తలొచ్చాయి. అయితే ఏవీ ఓకే అవ్వలేదో, లేక అవకాశాలే రాలేదో కానీ ఇప్పటివరకు సమంత ఏ సినిమా కూడా సైన్‌ చేయలేదు. ఇప్పుడు మరోసారి సమంత బాలీవుడ్‌ సినిమా ముచ్చట వినిపిస్తోంది.

ఈసారి ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షా రుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సరసన సమంత నటిస్తుంది అని వార్తలొస్తున్నాయి. గత ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’ (Jawan) , ‘డంకీ’ (Dunki) అంటూ హ్యాట్రిక్‌ కొట్టిన షా రుఖ్‌ ఇప్పుడు కొత్త సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో తనకు ‘డంకీ’ లాంటి వైవిధ్యమైన సినిమా, విజయం అందించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలని షా రుఖ్‌ అనుకుంటున్నాడట. ఆ సినిమాలోనే సమంత హీరోయిన్‌ అని అంటున్నారు.

ఒకప్పటి బాలీవుడ్‌ అయితే ఈ మాటల్ని మనం అంత త్వరగా నమ్మేయలేం. అయితే ఇప్పుడు బాలీవుడ్ వరుస మారింది. తమ స్టార్‌ హీరోల సినిమాల్లో సౌత్‌ నటీనటుల్ని తీసుకుంటున్నారు. సౌత్‌ దర్శకులు కాకపోయినా సౌత్‌ హీరోయిన్లను కాస్టింగ్‌ చేస్తున్నారు. ‘జవాన్‌’ సినిమాలో నయనతార వచ్చింది కూడా అలాగే. ఇప్పుడు సమంతను కూడా అదే కాన్సెప్ట్‌లో తీసుకుంటున్నారు అని టాక్‌. అయితే సినిమా కానీ, ఆమె కానీ ఎక్కడా ఫిక్స్‌ అవ్వలేదు.

ఎమోషన్ల మీద సినిమాలు చేసే రాజ్‌ కుమార్‌ హిరానీ (Rajkumar Hirani) ఈసారి యాక్షన్, అడ్వెంచర్, దేశభక్తి కలగలిపిన కథను సిద్ధం చేస్తున్నారట. త్వరలో ఈ విషయంలో అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. ఈ లోపు షా రుఖ్‌ తన కూతురు సుహానాను కథానాయికగా వెండితెరకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఆయన నటిస్తూ, నిర్మిస్తూ ఓ సినిమా చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.