March 15, 202511:59:27 AM

Shankar: ఆ ట్రోల్స్ కు చెక్ పెట్టేసిన శంకర్.. భలే చెప్పాడంటూ?

ఈ మధ్య కాలంలో సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఇండియన్2 (Bharateeyudu 2) సినిమా ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో కమల్ హాసన్  (Kamal Haasan) మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కమల్ శంకర్ (Shankar)  కాంబినేషన్ నిరాశ పరచదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఇండియన్2 ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే భారతీయుడు సినిమాలో కమల్ పోషించిన పాత్ర వయస్సు 106 సంవత్సరాలు అని 106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా చేస్తాడని కొంతమంది నుంచి ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఇందుకు సంబంధించి గతంలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే విమర్శలకు చెక్ పెట్టేలా ఒకింత ఘాటుగా శంకర్ జవాబిచ్చారు. చైనాలో లూ జియాన్ అనే మార్షన్ ఆర్ట్స్ మాస్టర్ 120 సంవత్సరాల వయస్సులో కూడా గాల్లో ఎగురుతున్నాడని ఫైట్స్ చేస్తూ కిక్స్ ఇస్తున్నాడని శంకర్ వెల్లడించారు.

ఆ ప్రేరణతో సేనాపతి పాత్రను తీర్చిదిద్దానని ఆయన తెలిపారు. శంకర్ చేసిన కామెంట్లతో ఇకపై విమర్శలు చేసేవాళ్లు సైలెంట్ కావాల్సిందేనని చెప్పవచ్చు. ఇండియన్2 సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. జులై రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా హిట్టైతే గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే శంకర్ వరుస సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.