March 22, 202502:17:12 AM

Sreeleela: వైరల్ అవుతున్న శ్రీలీల రెట్రో లుక్స్ ఫోటోలు.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకుని ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో శ్రీలీల (Sreeleela) ఒకరు. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా వరకు ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక యాడ్ లో శ్రీలీల నటించగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. శ్రీలీల ఈ ఫోటోలలో సీతారామం (Sita Ramam) సినిమాలో సీతలా ఉన్నారని మరి కొందరు చెబుతున్నారు.

త్వరలో ఈ యాడ్ రిలీజ్ కానుండగా రెట్రో షేడ్స్ లుక్స్ లో శ్రీలీల అదరగొట్టారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లుక్స్ లో నేను కొత్తగా కనిపించానని విభిన్నమైన లుక్స్ ట్రై చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శ్రీలీల పేర్కొన్నారు. శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ కు దాదాపుగా 3.5 లక్షల లైక్స్ వచ్చాయి. హను రాఘవపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో శ్రీలీల నటిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ (Prabhas) హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీలీల కొత్త ప్రాజెక్ట్స్ గురించి త్వరలో అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది. ఒకవైపు మెడిసిన్ చదువుతూనే మరోవైపు హీరోయిన్ గా సక్సెస్ సాధించడం సులువు కాదని అయితే శ్రీలీల మాత్రం చదువులో టాపర్ గా కొనసాగుతూనే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం జరిగిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కథల ఎంపిక విషయంలో శ్రీలీల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే ఆమె భవిష్యత్తుకు మరికొన్ని సంవత్సరాల పాటు ఢోకా ఉండదని చెప్పవచ్చు. కృతిశెట్టి (Krithi Shetty) తమిళంపై దృష్టి పెట్టి ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటుండగా శ్రీలీల కూడా తమిళంపై దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుంది. శ్రీలీల డ్యాన్సింగ్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. శ్రీలీల ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.