March 17, 202507:50:20 AM

Sundeep Kishan, Trinadha Rao: సందీప్ – త్రినాథ్..ల సినిమాకి క్రేజీ టైటిల్ ఫిక్స్..!

టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న దర్శకుల్లో త్రినాథ‌రావు (Trinadha Rao) న‌క్కిన‌ ఒకరు. ఇతను చేసిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ సాధించనవే. కానీ ఇతన్ని టాప్ డైరెక్టర్ గా మార్చిన సినిమా ‘ధ‌మాకా’ (Dhamaka) . ఆ సినిమా తర్వాత త్రినాథ్ రావ్ నక్కిన వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతాడు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.గత ఏడాది అంతా త్రినాథ్ రావ్ నక్కిన ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఓ సినిమా సెట్ చేసుకున్నా..

అది సందీప్ కిష‌న్ (Sundeep Kishan) వంటి టైర్ 3 హీరోతోనే చేస్తున్నాడు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్ర‌స‌న్న కుమార్ (Prasanna Kumar Bezawada) ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నాడు. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ (Samajavaragamana) ఫేమ్ రాజేష్ దండా (Rajesh Danda) నిర్మాత‌. ఇది క్రేజీ కాంబినేషన్ కావడంతో.. ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అందుకు తగ్గట్టు మంచి టైటిల్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే హైప్ పెరుగుతుంది.

అందుకే ఈ సినిమాకి ‘స్టిల్ బ్యాచిల‌ర్‌’, ‘రింగ్ మాస్ట‌ర్’ వంటి పేర్లు అనుకున్నారు. కానీ ఎందుకో వాటి సౌండింగ్ అంతంత మాత్రంగానే ఉందని టీం అభిప్రాయపడింది. దీంతో `మ‌జాకా` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. మలయాళంలో హిట్ అయిన ‘బ్రో డాడీ’ స్ఫూర్తితో రూపొందుతున్న సినిమా ఇది. తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ. రావుర‌మేష్‌ (Rao Ramesh) , సందీప్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. రావు ర‌మేష్ సరసన ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్ అన్షుని (Anshu Ambani) తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. సందీప్ కి జోడీగా రీతూవ‌ర్మ‌ (Ritu Varma) నటిస్తుంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అంటే మొత్తం ‘ధమాకా’ టీమ్.. ఈ ‘మజాకా’ కి పనిచేస్తుంది అని చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.