March 15, 202509:48:06 AM

Sushmita Konidela: పవన్ తో అనుబంధం గురించి చెప్పుకొచ్చిన సుష్మిత.. ఏం చెప్పారంటే?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ గా సాధించిన విజయాలతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. సుష్మిత కొణిదెల (Sushmita Konidela) తాజాగా ఒక సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సుష్మిత ప్రముఖ ఓటీటీలకు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ బాబాయ్ గెలుపు వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని ప్రస్తుతం కుటుంబమంతా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నామని సుష్మిత పేర్కొన్నారు.

పాలిటిక్స్ గురించి నాకు అవగాహన తక్కువని అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎప్పటికైనా సక్సెస్ అవుతారని నేను భావించానని సుష్మిత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. పవన్ బాబాయ్ నాకు, చరణ్ కు (Ram Charan) మధ్య గొడవలు పెట్టేవాడని నన్ను బాగా ఆట పట్టించేవాడని సుష్మిత పేర్కొన్నారు. పవన్ వరుసకు బాబాయ్ అయినా బాబాయ్ లా ఎప్పుడూ ట్రీట్ చేయలేదని పవన్ ను అన్నలా ఫీలవుతానని సుష్మిత చెప్పుకొచ్చారు.

సుష్మిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సుష్మిత చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తులో చిరంజీవితో (Chiranjeevi) ఒక భారీ బడ్జెట్ సినిమాను నిర్మించాలని సుష్మిత కలలు కంటుండగా ఆ కల నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. సుష్మిత వెబ్ సిరీస్ లతో మాత్రం అభిరుచి ఉన్న నిర్మాతగా సత్తా చాటడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

సుష్మిత పలు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. సుష్మిత కొణిదెల కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. సుష్మితను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.