March 26, 202509:38:00 AM

Venkatesh, Aishwarya Rajesh: వెంకీ – అనిల్ రావిపూడి..ల హ్యాట్రిక్ మూవీకి హీరోయిన్ ఫిక్స్..!

‘ఎఫ్‌ 2’(F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) వంటి హిట్ సినిమాలతో వెంకటేష్ (Venkatesh), దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi ) కాంబినేషన్ పై క్రేజ్ పెరిగింది. అలాగే అనిల్ రావిపూడిపై కూడా వెంకటేష్ కి నమ్మకం పెరిగింది. దీంతో ఈ మధ్య ఏ దర్శకుడి కథకి ఓకే చెప్పని వెంకటేష్.. అనిల్ రావిపూడి కథకి ఓకే చెప్పారు. ‘ఎఫ్ 2 ‘ ‘ఎఫ్ 3’ అనేవి మల్టీస్టారర్ సినిమాలు. కానీ ఈసారి వెంకటేష్ ను సోలో హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం లేదు అనేది లేటెస్ట్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం..’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఎంపికయ్యిందట.

ఈ మధ్యనే లుక్ టెస్ట్ చేయడం.. వెంకీ సరసన ఆమె కరెక్ట్ గా సెట్ అయ్యింది అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఉందట. ఆమె మిలిటరీకి చెందిన అమ్మాయిగా ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్టు వినికిడి. ఇక త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి.. 4 నెలల్లో ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.