March 22, 202509:15:46 AM

Venkatesh , Anil Ravipudi: వెంకీ సినిమా… బిజీ బిజీగా అనిల్‌ రావిపూడి.. ఏం చేస్తున్నారంటే?

‘ఎఫ్‌ 2’(F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) తో ఇప్పటికే వెంకీకి (Venkatesh) హిట్లు ఇచ్చిన అనిల్‌ (Anil Ravipudi ) మరోసారి హిట్‌ ఇచ్చి హ్యాట్రిక్‌ కొట్టే పనిలో ఉన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ త్వరలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో అంటే త్వరలో సినిమా వచ్చేస్తుంది అని కాదు. త్వరలో సినిమా ప్రారంభిస్తారు అని అర్థం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నా.. ఇంతవరకు ఎక్కడా అధికారికంగా ప్రారంభం కాలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలో సినిమా ముహూర్తం ఉంటుంది అంటున్నారు.

ఎందుకంటే పనులు కొలిక్కి వచ్చాయి అని టాక్‌. ఈ ఏడాది పెద్ద పండగకు ‘సైంధవ్‌’ (Saindhav) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు వెంకటేశ్‌. ప్రతిష్ఠాత్మక 75వ సినిమాగా వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత ఏ సినిమా కూడా ప్రకటించని వెంకీ.. దిల్‌ రాజు (Dil Raju) నిర్మాణంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇంతవరకు ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఏమైందా, ఎంతవరకు వచ్చింది అని చూస్తే.. కొన్ని విషయాలు తెలిశాయి.

సినిమా స్క్రిప్ట్‌ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. కథ డైలాగ్‌ వెర్షన్‌ను సిద్ధం చేయడంలో అనిల్‌ రావిపూడి బిజీగా ఉన్నారట. మరోవైపు ఇంకో హీరోయిన్‌ను ఫైనల్‌ చేసే పనులూ జరుగుతున్నాయట. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో ఓ నాయిక మీనాక్షి చౌదరిని (Meenakshi Chaudhary) ఇప్పటికే ఫైనల్‌చేశారు. మరో హీరోయిన్‌ను త్వరలో ఫైనల్‌ చేస్తారట.

ఇక వెంకటేశ్‌ ప్రస్తుతం ‘రానా నాయుడు 2’ (Rana Naidu)  వెబ్‌ సిరీస్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ సిరీస్‌ పనులు అయ్యాక ఆగస్టు నుండి సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తారట. క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపిస్తారని టాక్‌. అంటే కాస్త ఏజ్డ్‌ పాత్రలోనే వెంకీ కనిపిస్తారని చెప్పొచ్చు. మరి ఇలాంటి పాత్రతో అనిల్‌ రావిపూడి ఎలా నవ్వులు పూయిస్తారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.