March 20, 202506:59:52 AM

Vijayashanti: ఆ హీరోలతో నటించడానికి అందుకే నో చెప్పాను.. ఆమె చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంటుంది. అలా క్రేజ్ ను సొంతం చేసుకున్న కాంబినేషన్లలో బాలయ్య (Nandamuri Balakrishna) విజయశాంతి కాంబినేషన్ కూడా ఒకటి. అయితే నిప్పురవ్వ (Nippu Ravva) తర్వాత బాలయ్య విజయశాంతి (Vijayashanti) కాంబినేషన్ లో సినిమాలు రాలేదనే సంగతి తెలిసిందే. బాలయ్యతో నటించకపోవడానికి కారణాలేంటనే ప్రశ్నకు విజయశాంతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివాదాల వల్ల బాలయ్యతో కలిసి నటించలేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె తెలిపారు.

ఆ సమయంలో నేను వేరే సినిమాలతో బిజీ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఆ సమయంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడం జరిగిందని విజయశాంతి పేర్కొన్నారు. దర్శకనిర్మాతలు సైతం నాకు అలాంటి పాత్రలు మాత్రమే ఆఫర్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. నేను నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు సమాన స్థాయిలో ఆడటంతో పాటు ఆ సమయంలో నేను తీసుకున్న రెమ్యునరేషన్ సైతం ఎక్కువని విజయశాంతి పేర్కొన్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల వల్ల హీరో ఇమేజ్ వస్తుందని యాక్షన్ సినిమాలను చేస్తానని అంత బిజీ అవుతానని నేను అనుకోలేదని ఆమె తెలిపారు. ఈ రీజన్స్ వల్లే స్టార్స్ తో చేయలేదు తప్ప అంతకు మించి ప్రత్యేక కారణాలు లేవని విజయశాంతి చెప్పుకొచ్చారు. విజయశాంతి ప్రస్తుతం సెలెక్టివ్ రోల్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు.

విజయశాంతి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. విజయశాంతికి కెరీర్ పరంగా తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు. విజయశాంతి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలోనే జరుగుతోందని తెలుస్తోంది. విజయశాంతికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.