March 15, 202509:36:57 AM

Yash: ‘కల్కి 2898 AD ‘ పై ప్రశంసలు కురిపించిన యష్

ప్రభాస్  (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin)  ..ల ‘కల్కి..'(Kalki 2898 AD)  నిన్న అంటే జూన్ 27న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి అనే చెప్పాలి. మరోపక్క ఈ సినిమా చూసిన పాన్ ఇండియా స్టార్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిన్న రాజమౌళి  (Rajamouli) ‘కల్కి..’ ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కె.జి.ఎఫ్’ (KGF) హీరో యష్ (Yash) సైతం ‘కల్కి 2898 ad’ అద్భుతం అంటూ ప్రశంసించాడు.

యష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “‘కల్కి 2898 ad’ టీంకి ఇండియన్ సినిమాకు మరింత వైభవాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా టీంని ఎంత ప్రసంసించినా తక్కువే. విజువల్స్ అన్నీ ఇంకా నా మైండ్లో నుండి పోవడం లేదు. ఈ రేంజ్ స్టోరీ టెల్లింగ్ ను నేను ఇప్పటివరకు చూడలేదు. అది చాలా క్రియేటివ్ గా అనిపించింది. వైజయంతి మూవీస్ టీం, దర్శకుడు నాగ్ అశ్విన్ ..ల విజన్ కి, అలాగే ఇలాంటి గొప్ప ప్రాజెక్టుని నిర్మించేందుకు చేసిన గట్స్ కి మెచ్చుకోకుండా ఉండలేం.

ఇలాంటి మరిన్ని పెద్ద ప్రాజెక్టులు చేయడానికి మిగిలిన ఫిలిం మేకర్స్ లో సైతం స్ఫూర్తి నింపేలా ఉంది ఈ చిత్రం. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనె..లను ఒకే స్క్రీన్ పై చూడటం చాలా ఆనందాన్ని కలిగించింది. కల్కి ప్రాజెక్టు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.