March 21, 202512:51:28 AM

Yvs Chowdary: ఆ ప్రశ్న విషయంలో ఫైర్ అయిన వైవీఎస్ చౌదరి.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) ఒకరు. ఎంతోమంది హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి నందమూరి ఫ్యామిలీ నుంచి జానకిరామ్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ పేరుతో వైవీఎస్ చౌదరి కొత్త బ్యానర్ ను మొదలుపెట్టడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) మునిమనవడు ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. అయితే జానకిరామ్ కొడుకు హీరోగా చేయబోయే సినిమా కథ కుటుంబ సభ్యులకు తెలుసా అనే ప్రశ్నపై వైవీఎస్ చౌదరి ఫైర్ అయ్యారు.

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా కథను తాను నాగార్జునకు (Nagarjuna) చెప్పాను తప్ప తాను మరే హీరోకు సినిమా కథ చెప్పలేదని వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు. నాపై నమ్మకంతో మాత్రమే హీరోలు సినిమాలలో నటించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. రేయి సినిమాను సాయితేజ్ తో (Sai Dharam Tej) తెరకెక్కించడానికి పవన్ కు (Pawan Kalyan) తాను కథ చెప్పలేదని అదే విధంగా హరికృష్ణతో (Hari Krishna) తాను సినిమాలు తీసినా ఆ సినిమాల కథలు హరికృష్ణకు సినిమా తీయడానికి ముందు తెలియదని వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు.

కథ చెబితే స్టోరీ లైన్ చెబితే మాత్రమే నాతో సినిమాలు చేస్తామని హీరోలెవరూ అనలేదని ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కళ్యాణ్ రామ్ (Kalyan Ram) లకు ఈ సినిమా కథ తెలియడం వల్ల మీకు వచ్చే ఆనందం ఏంటి అని వైవీఎస్ చౌదరి వెల్లడించారు. మరోవైపు జానకి రామ్ (Janaki Ram) కొడుకు పేరు కూడా ఎన్టీఆర్ కావడం హాట్ టాపిక్ అవుతోంది.

ఈ పేరుతోనే జానకిరామ్ కొడుకు ఇండస్ట్రీలో కొనసాగుతారేమో చూడాల్సి ఉంది. మరోవైపు జానకిరామ్ కుటుంబానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎలాంటి ఇబ్బంది రాకుండా అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వైవీఎస్ చౌదరి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.