April 1, 202502:26:37 AM

Amitabh Bachchan: అమితాబ్ డెడికేషన్ కు ఫిదా అవ్వాల్సిందే.. ఇలా ఎవరూ ఉండరుగా!

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటు అమితాబ్ (Amitabh Bachchan) కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలిచింది. ప్రభాస్ (Prabhas) పాత్ర నిడివి తక్కువైనా సినిమాలో కనిపించిన ప్రతి సన్నివేశంలో ప్రభాస్ తన తన నటనతో ఆకట్టుకున్నారు. అమితాబ్ తాజాగా కల్కి షూట్ కు సంబంధించిన విశేషాలను పంచుకోగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కల్కి సినిమా షూట్ సమయంలో నేను వాష్ రూమ్ కు వెళ్లడానికి కూడా అనుమతి అడిగానని నాగ్ అశ్విన్ (Nag Ashwin)  చెప్పారని అలా నేను అనుమతి అడగడం నిజమేనని అమితాబ్ పేర్కొన్నారు.

షూటింగ్ లో పాల్గొనే సమయంలో దర్శకుడే కెప్టెన్ అని సెట్ లో ఉన్నంతసేపు నేను పనివాడిని మాత్రమేనని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఆ సమయంలో నేను బయటకు వెళ్లాలంటే డైరెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. సెట్ కు నన్ను పిలిచింది దర్శకుడు కాబట్టి దర్శకుడు చెప్పిన విషయాలను నేను తూచా తప్పకుండా పాటించాల్సి ఉందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.

నేను అదే చేశానని ఆయన వెల్లడించారు. 80 సంవత్సరాల వయస్సులో అమితాబ్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టి ప్రశంసలు అందుకున్నారు. అమితాబ్ డెడికేషన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా ఎంతో కష్టపడుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. కల్కి సీక్వెల్ లో సైతం అమితాబ్ రోల్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.