March 19, 202511:24:02 AM

Anudeep KV: అనుదీప్‌ కొత్త సినిమా.. హీరో మారిపోయాడు.. ఇదైనా ముందుకెళ్తుందా?

‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో తెలుగు సినిమాలో ఓ రకం కామెడీకి స్టార్టింగ్‌ కిక్‌ కొట్టారు దర్శకుడు అనుదీప్‌. సగటు జనాలు మాట్లాడుకునే భాష, యాస, నడుచుకునే తీరుతో ఆ సినిమా రూపొంది ఆకట్టుకుంది. డబ్బులు కూడా నిర్మాతకు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అనుదీప్‌ (Anudeep Kv) వరుస సినిమాలు చేస్తారు అనుకుంటే ‘ప్రిన్స్‌’ సినిమా ఇచ్చిన ఇబ్బందికర ఫలితంతో జోరు తగ్గింది. అయితే ఆయనకు సరైన నటుడు దొరికితే మరోసారి ‘జాతిరత్నాలు’ లాంటి విజయం పక్కా అని అనిపిస్తుంటుంది.

ఈ క్రమంలో అనుదీప్‌ కొత్త సినిమా అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రవితేజతో (Ravi Teja) సినిమా అని, వెంకటేశ్‌తో (Venkatesh) సినిమా అని ఇలా చాలాపేర్లే వ్చాయి. అయితే ఏమైందో ఏమో ఏ సినిమా కూడా ఓకే అవ్వలేదు. అయితే తాజాగా అనుదీప్‌.. విశ్వక్‌సేన్‌కి (Vishwak Sen) ఓ కథ చెప్పారు అని టాక్‌ నడుస్తోంది. సింగిల్ సిట్టింగ్‌లో దాదాపు కథ ఫైనల్‌ అయిపోయిందని, త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుందని, అక్టోబర్‌లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని భోగట్టా.. ఈ సినిమాను కూడా కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. విభిన్నమైన సినిమా కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న విశ్వక్.. ఈసారి పూర్తిస్థాయి కామెడీ ట్రై చేసే ఆలోచనలోనే అనుదీప్‍కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో చూడాలి.

ఈ ఏడాది విశ్వక్‌సేన్‌కి రెండు హిట్లు వచ్చాయి. ప్రయోగాత్మక చిత్రం ‘గామి’ (Gaami) మంచి వసూళ్లను అందుకోగా, రూరల్ యాక్షన్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) కూడా మంచి ఫలితాన్నే అందించింది. మరిప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక విశ్వక్‍ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) అనే సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు ‘లైలా’ (Laila) అనే మరో ప్రయోగం కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో విశ్వక్‌ కనిపిస్తాడు. అంటే ప్రయోగం ప్రయోగమే.. కామెడీ కామెడీయే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.