March 22, 202507:58:59 AM

Bimbisara Prequel: ‘బింబిసార 2’ దర్శకుడు ఫిక్స్‌.. త్వరలోనే సినిమా స్టార్ట్‌.. ఇవిగో వివరాలు..!

ఒక విజయం, వరుస పరాజయాలు.. గతకొన్నేళ్లుగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) కెరీర్‌ ఇలానే నడుస్తూ వస్తోంది. అదిరిపోయే హిట్‌ కొట్టారు ఇక కెరీర్‌ ఫుల్‌ జోష్‌లోకి వెళ్తుంది అనగా.. వరుసగా ఫ్లాప్‌లు ఇస్తుంటారు. అలా ఆయనకు రీసెంట్‌గా వచ్చిన భారీ విజయం ‘బింబిసార’ (Bimbisara) . మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు పార్ట్‌ 2 ఉంటుందని అప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు దానిని ప్రీక్వెల్‌ రూపంలో అనౌన్స్‌ చేసేశారు.

కల్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సినిమా టీమ్‌. ‘బింబిసార’కు ప్రీక్వెల్‌గా రెండో భాగం తెరకెక్కనున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తొలి పార్టు విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనుల్లో కీలకంగా నిలిచిన అనిల్ పాడూరి కెప్టెన్‌ను చేశారు. #NKR22 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. మరి ఈ సినిమాలో ఏం చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

‘బింబిసార’ కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రీక్వెల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు నిర్మాతలు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఇప్పటిదాకా చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను చూపించడానికి అనిల్‌ అండ్‌ టీమ్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఆకాశ్‌ పూరి (Akash Puri) – కేతిక శర్మతో (Ketika Sharma) ‘రొమాంటిక్‌’ (Romantic) అనే సినిమా తీసి మెప్పించిన అనిల్‌ ‘బింబిసార 2’ను అంతకుమించిన స్థాయిలో రూపొందిస్తారని టీమ్‌ చెబుతోంది.

మరోవైపు కల్యాణ్‌ రామ్ #NKR21 సినిమా ఫస్ట్‌లుక్‌ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar) కథానాయిక. ఇక సీనియర్‌ నటి విజయశాంతి (Vijayashanti) పోలీసుగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే ఆమె గురించి విడుదల చేసిన గ్లింప్స్‌కు భలే స్పందన వచ్చింది. మరి సినిమాలో ఏ స్థాయిలో ఆమె తన నట విశ్వరూపం చూపించారో చూడాలి.

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.