April 16, 202501:57:19 PM

గద్దర్ అవార్డ్ లపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుచున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ A. రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన విషయముల గురించి వివరముగా చర్చించిన మీదట ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్ లో వున్న అవార్డ్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ” గద్దర్ అవార్డ్స్ ” పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్ కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీ ని నియమించి సదరు విధి విధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ A. రేవంత్ రెడ్డి గారికి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నాము.

(పి.భరత్ భూషణ్)

అధ్యక్షులు

(కె. ఎల్. దామోదర్ ప్రసాద్) (కె. శివప్రసాద రావు)

కార్యదర్శులు

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.