March 31, 202510:11:55 AM

తన పై పెట్టిన చీటింగ్ కేసుపై స్పందించిన స్టార్‌ హీరోయిన్.!

నెల రోజుల క్రితం… టాలీవుడ్ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పై చీటింగ్ కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ‘షో స్టాపర్’ అనే వెబ్ సిరీస్ దర్శకుడు, నిర్మాత అయినటువంటి మనీశ్ హరిశంకర్.. హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీపై మొన్నామధ్య ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతను మాట్లాడుతూ.. “షో స్టాపర్‌ ప్రాజెక్ట్‌ లో హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) కూడా భాగమయ్యేలా చేస్తాను, బాలీవుడ్లో అక్షయ్‌ కుమార్‌, షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) , సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) వంటి వారు తనకి బాగా తెలుసు, వారిని ఈ ప్రాజెక్టులో భాగం చేస్తాను అని నమ్మించి మోసం చేసింది” అంటూ ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.

అలాగే ‘మా ప్రాజెక్టు ఆగిపోయిందని, డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు చేసి’ మా బ్యానర్‌ గౌరవాన్ని దిగజార్చిందంటూ’ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాల పై దిగంగన సూర్య వంశీ (Digangana Suryavanshi)  వెంటనే క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈమె నెక్స్ట్ తెలుగు మూవీ ‘శివం భజే’ (Shivam Bhaje) ట్రైలర్ లాంచ్ ఈరోజు ‘ఎఎఎ సినిమాస్’ లో ఘనంగా జరిగింది. అనంతరం టీం అంతా మీడియాతో ముచ్చటించింది. ఆ టైంలో దిగంగన కి ఈ విషయం పై ప్రశ్న ఎదురైంది.

ఇబ్బంది పడుతూనే ఆమె సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ..”మరో 3 రోజుల్లో ఆర్టీఐ దీనిపై స్పందించనుంది. నేను ఆ డౌన్లో ఉండలేదు. అవన్నీ బేస్ లెస్ ఎలిగేషన్స్. ఇలాంటివి ప్రచారంలోకి రావడం అనేది మానసికంగా చాలా దెబ్బతీస్తుంది. కానీ తప్పవు. ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి. నా తప్పు లేదు కాబట్టి.. ఆ విషయం అక్కడితో ఆగిపోయింది” అంటూ చెప్పుకొచ్చింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.