March 21, 202501:01:38 AM

Chinmayi Sripada: చిన్మయి చెప్పింది అనసూయ గురించేనా.. మరి అనసూయ ఏమంటుందో?

అనసూయ (Anasuya Bhardhwaj) చేసే చిలిపి (ఆమె దృష్టిలో) వేషాలకు నెటిజన్లు గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటారు. దానికి ఆమె నేనింతే, ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, అయినా నేనేం చేయాలో కూడా మీరే చెబుతారా? మహిళల పట్ల ఇదే వైఖరి అంటూ క్లాసు పీకుతుంది. అన్ని జనాలు నెటిజన్లు కరెక్ట్‌ కాదు, అన్నిసార్లు ఆమె కూడా కరెక్ట్‌ కాదు. అందుకే ఆమె చేసే పనులకు ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది. తాజాగా స్టేజ్ మ్యానర్స్ గురించి ఈ చర్చ మళ్లీ మొదలైంది.

అయితే ఈ చర్చ మొత్తం జరుగుతున్న వీడియో కొత్తది కాదు.. కానీ విజయ్‌ దేవరకొండ  (Vijay Devarakonda) ఫ్యాన్స్‌ అంటూ కొంతమంది ఓ వీడియో తాజాగ వైరల్‌ చేస్తున్ఆరు. ఓ టీవీ షోకు సంబంధించి వీడియో అది. ఆ పిల్లల షోలో అనసూయ ఓ బుడ్డోడితో లిప్ లాక్ పెట్టిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లోనే ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ విజయ్‌ ఫ్యాన్స్‌ (ఇప్పుడు వాళ్లెందుకు మళ్లీ రియాక్ట్‌ అవుతున్నారో ఆఖరులో చూద్దాం) ఆ వీడియోను పైకి తీసుకురావడంతో ప్రముఖ గాయని చిన్మయి కంట పడింది.

దీంతో ఆ షో మీద చిన్మయి (Chinmayi Sripada) ఫైర్ అయింది. ఇలాంటి పనులు తగదు.. చిన్న పిల్లల మీద దుష్ప్రభావం పడుతుంది అంటూ మండిపడింది. ఓ పిల్లాడిని ఓ ఫీమేల్ హోస్ట్ ముద్దు ఇవ్వమని అడిగిన సీన్ చూశా. ఆ సీన్ చూసి అక్కడి ఆడియెన్స్, పేరెంట్స్ తెగ నవ్వుతున్నారు, ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ఒకవేళ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే, ఇప్పుడు ఏది ఒప్పు, ఏది తప్పు అని కన్ఫ్యూజ్ అవుతాడు అని చిన్మయి ఫైర్‌ అయింది.

పిల్లల మీద, పిల్లలతో చేసే షోలు భయంకరంగా ఉంటున్నాయి. ఇది ఎప్పటికీ వినోదం అనిపించుకోదు. చైల్డ్ సేఫ్టీకి ఉపయోగపడవు కూడా. సమాజం వీటిని అంగీకరించకూడదు అని పోస్టులో రాసుకొచ్చింది. అసలు ఇదంతా సెక్సువల్ అబ్యూస్ అవుతుంది అని కూడా అంది. ఇన్నాళ్లూ ఎవరన్నా, ఏమన్నా అంటే గోల గోల చేసే అనసూయ ఇప్పుడు ఏమంటుందో చూడాలి. ఇక్కడో విషయం ఏంటంటే ఆ పోస్టులో ఎక్కడా అనసూయ పేరు ప్రస్తావించలేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.