March 17, 202507:29:16 AM

Disha Patani: దిశా పటాని టాటూ వెనుక అర్థం అదేనా..!

దిశా పటాని (Disha Patani) .. కెరీర్ ప్రారంభమైంది తెలుగు సినిమాతోనే..! 2015 లో వచ్చిన ‘లోఫర్’ (Loafer) సినిమాతో ఆమె సినీ రంగప్రవేశం చేసింది. మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో వెంటనే బాలీవుడ్ కి చెక్కేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఈమె ‘ఎం.ఎస్.ధోని'(బయోపిక్) లో నటించింది. అది సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్లు ఈమె తలుపు తట్టాయి. ‘భాగి 2’ ‘బాగి 3’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ అమ్మడు..

ఇటీవల ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో ప్రభాస్ (Prabhas) గర్ల్ ఫ్రెండ్ రాక్సి అనే పాత్రలో ఈమె నటించింది. ప్రభాస్ – దిశా పటాని..ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా కథలో భాగంగానే వస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ టైంలో దిశా పటాని ప్రభాస్ కి బాగా దగ్గరైనట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె లేటెస్ట్ ఫోటో కూడా ‘ఇది నిజమేనేమో’ అనే అనుమానాలకు దారి తీసేలా చేసింది. విషయం ఏంటంటే.. దిశా పటాని లేటెస్ట్ ఫోటోలో ఆమె ఎడమ చేతిపై ‘పీడి'(PD) అనే టాటూ ఉంది. దీనికి ‘ప్రభాస్ డార్లింగ్’ అనే అర్థం వస్తుంది అని అంతా అంటున్నారు. అయితే దిశా పటానిలో కూడా ‘P D’ ఉంటాయి కానీ రివర్స్ లో ఉంటాయి. ఈ టాటూతో ఆమె ప్రభాస్ తో డేటింగ్లో ఉన్నట్టు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై దిశా పటాని ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.