March 26, 202508:45:56 AM

Double Ismart OTT: డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్ లెక్క ఇదే.. ఎన్ని రూ.కోట్లంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్  (Ram)  హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  డైరెక్షన్ లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్  (Double Ismart) మూవీ ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)  , తంగలాన్ (Thangalaan) సినిమాల నుంచి పోటీ ఎదురవుతుండటం గమనార్హం. అటు పూరీ జగన్నాథ్ ఇటు రామ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా 33 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

సౌత్ హక్కుల కోసం అమెజాన్ ఇంత మొత్తాన్ని ఖర్చు చేసిందని భోగట్టా. ఇస్మార్ట్ శంకర్  (iSmart Shankar) సినిమాకు సీక్వెల్ కావడం, రామ్ సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఈ స్థాయిలో ఖర్చు చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ లెక్క తెలిసి ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను అందించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ కు రిలీజ్ కు ముందే 15 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఒకింత రిస్క్ చేసి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ ఉంది. డబుల్ ఇస్మార్ట్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

డబుల్ ఇస్మార్ట్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలో డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.