April 1, 202502:02:16 AM

Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’ అసలైన సర్ప్రైజ్ అదేనా.. పూరి ప్లాన్ మామూలుగా లేదుగా

పూరి జగన్నాథ్ (Puri Jagannadh) , రామ్ పోతినేని (Ram).. కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమా వచ్చింది. మొదటి షోతోనే అది సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందుకుంది. ఈ సినిమాతో హీరో రామ్ మార్కెట్ డబుల్ అయ్యింది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్.. అయితే అప్పటివరకు చేసిన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. వాస్తవానికి రిలీజ్ కి ముందు ‘ఇస్మార్ట్ శంకర్’ పై అంత హైప్ లేదు.కానీ మౌత్ టాక్ తో పుంజుకుంది ఆ సినిమా.

ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందింది. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  పేరుతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్, టీజర్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి స్పందించిన లభించింది. అవి సినిమాపై అంచనాలు కూడా పెంచాయని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘డబుల్ ఇస్మార్ట్’ లో ఓ సర్ప్రైజ్ కూడా ఉందట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో నభా నటేష్  (Nabha Natesh) ఎంట్రీ కూడా ఉండబోతుందట.

అది పూరి టీం సర్ప్రైజింగ్ గా ఉంచినట్టు సమాచారం.వాస్తవానికి మొదటి భాగంలో నభా నటేష్ చనిపోయినట్టు చూపించారు. అలాంటప్పుడు సెకండ్ పార్ట్ లో ఆమె ఎలా బ్రతికొస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ ఇలాంటి ట్విస్ట్..లను బాగా హ్యాండిల్ చేస్తుంటాడు. అది సినిమాలో కీలకంగా కూడా ఉండొచ్చు. మరోపక్క ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) నటిస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.