March 21, 202512:41:25 AM

Game Changer: గేమ్ ఛేంజర్ షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చిన థమన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan)  గేమ్ ఛేంజర్ (Game Changer)  సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana)  కాంబో మూవీ పెద్ది అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. థమన్ తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ ఇవ్వగా థమన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉంటాయని థమన్ (S.S.Thaman) చెప్పుకొచ్చారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆగష్టు నెలలో విడుదల కానుందని థమన్ వెల్లడించారు. గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. జరగండి జరగండి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ (Shankar)  గేమ్ ఛేంజర్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

గేమ్ ఛేంజర్ సినిమాకు కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించారు. చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని భోగట్టా. రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. చరణ్ తన క్రేజ్ తో గేమ్ ఛేంజర్ మూవీ బిజినెస్ పరంగా సైతం సంచలనాలు సృష్టిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) సినిమా తర్వాత చరణ్ కియారా   (Kiara Advani) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమా చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు (Dil Raju)  ఈ సినిమాతో నిర్మాతగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.