March 20, 202511:16:53 PM

Jr NTR, Karthi: ఎన్టీఆర్ వర్సెస్ కార్తీ.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర (Devara) ఈ ఏడాది సెప్టెంబర్ నెల 27వ తేదీన విడుదల కానుంది. అయితే దేవర సినిమాకు పోటీ లేనట్టేనని చాలామంది భావించగా ఎవరూ ఊహించని విధంగా కార్తీ సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీన విడుదల కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. దేవరతో క్లాష్ కు కార్తీ (Karthi) సిద్ధం కావడంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతుండటం కొసమెరుపు. కార్తీ మెయియాజగన్ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ నెల 27వ తేదీన విడుదల కానున్నట్టు ప్రకటన వచ్చింది.

జపాన్ (Japan) సినిమా తర్వాత కార్తీ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. జపాన్ ఫ్లాప్ కాగా మెయియాజగన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. అరవింద స్వామి (Arvind Swamy) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మెయియాజగన్ సినిమా దేవరకు పోటీగా విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో కార్తీ సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దేవరతో పోటీ కార్తీకి అవసరమా అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో సైతం దేవర రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది. కార్తీ సినిమాతో పోటీని దేవర మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆగష్టు నెల నుంచి వరుస అప్ డేట్స్ వచ్చేలా దేవర మేకర్స్ ప్లాన్ ఉందని తెలుస్తోంది.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  సైతం ఈ సినిమా ప్రమోషన్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నారని భోగట్టా. ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని అభిమానులు భావిస్తున్నారు. కల్కి (Kalki 2898 AD)  తర్వాత రిలీజ్ కానున్న భారీ సినిమా కావడం దేవర సినిమాకు మరింత కలిసొచ్చిందని చెప్పవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.